విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయడంతో పాటు, 22వ జీఓను తక్షణమే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్ణాటక, తమిళనాడు సహ ఇన్‌చార్జి శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ ఇన్‌చార్జి నున్న రవికుమార్, గుత్త వెంకటేశ్వర్లు, మండదపు సుబ్బారావు, రుద్రగాని మాధవ్, మార్తినేని వీరభద్రప్రసాద్, అల్లిక అంజయ్య, పిట్టల వెంకట్ నర్సయ్య, మిగడ గోపి, కోటి హనుమంతరావు, అంకతి పాపారావు, కుమిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

22 జీఓ రద్దు చేయాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి