1వ వార్డులో వైసీపీ నుంచి కూటమిలోకి భారీ చేరికలు.
కడప జిల్లా రాజంపేట పట్టణం 1వ వార్డులో చేనేపల్లి హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక, చేరికల కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.మైనారిటీ సోదరులు, యువత పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు కొత్తగా చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేనేపల్లి హరీష్ కుమార్, షేక్ జాబీర్, అమీర్ తదితరులు పర్యవేక్షించారు.


