Tuesday, 21 July 2026
  • Home  
  • 120 ఎకరాల చెరువు స్థలం కబ్జాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

120 ఎకరాల చెరువు స్థలం కబ్జాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని బంగారమ్మ చెరువులో సుమారు 120 ఎకరాల మేర స్థలం కబ్జా చేశారంటూ గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు స్థలంలో సాగు చేపట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. గతంలో అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి చెరువు హద్దులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి చెరువును యథాతథ స్థితికి తీసుకురావాలని గ్రామస్థులు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని బంగారమ్మ చెరువులో సుమారు 120 ఎకరాల మేర స్థలం కబ్జా చేశారంటూ గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు స్థలంలో సాగు చేపట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. గతంలో అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి చెరువు హద్దులను గుర్తించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి చెరువును యథాతథ స్థితికి తీసుకురావాలని గ్రామస్థులు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.