గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు నిర్ణీత సమయంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం పెదబయలు జీసీసీ గ్యాస్ గోడౌన్, డీఆర్ డిపో, పెట్రోల్ బంక్ మరియు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్షించారు.
ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసిన ప్రతి వినియోగదారుడికి నిర్దేశించిన గడువులోనే సిలిండర్ అందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు అధికంగా ఉన్నందున సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సకాలంలో గ్యాస్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడకూడదని తెలిపారు. అధికారులు చేసే తప్పిదాల ప్రభావం ప్రభుత్వంపై పడే అవకాశం ఉన్నందున బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెదబయలు: గ్యాస్ సిలిండర్ సరఫరాలో జాప్యం వద్దు
గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు నిర్ణీత సమయంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం పెదబయలు జీసీసీ గ్యాస్ గోడౌన్, డీఆర్ డిపో, పెట్రోల్ బంక్ మరియు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్షించారు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసిన ప్రతి వినియోగదారుడికి నిర్దేశించిన గడువులోనే సిలిండర్ అందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు అధికంగా ఉన్నందున సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సకాలంలో గ్యాస్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడకూడదని తెలిపారు. అధికారులు చేసే తప్పిదాల ప్రభావం ప్రభుత్వంపై పడే అవకాశం ఉన్నందున బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

