మోడల్ కాలనీలో పెన్షన్ పంపిణీ – ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి చర్యలు
కడప, అక్టోబర్ 1 పున్నమి ప్రతినిధి : కడప నగరంలోని మోడల్ కాలనీలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
పెన్షన్‌కు సంబంధించిన సమస్యలు, కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం తదితర ప్రజా సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.



