రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొని లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
పెన్షన్ అందుకున్న లబ్ధిదారులతో రూపానంద రెడ్డి ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.


