తీవ్రంగా ఖండించిన న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు
ఆసిఫాబాద్, జూలై 4: దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు జావిద్ అలీ ఖాన్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడి సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా 89కు పైగా ప్రధాన పరీక్షల పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి రావడం అత్యంత ఆందోళనకరమని జావిద్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిపై చార్జ్‌షీట్లు దాఖలు చేశారు, ఎంతమందికి కోర్టులు శిక్షలు విధించాయనే వివరాలను శ్వేతపత్రం రూపంలో దేశ ప్రజలకు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వంటి ఘటనలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. పేపర్ లీక్‌ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి, వారికి రాజకీయ లేదా అధికార పరమైన రక్షణ కల్పించకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, అనిశ్చితి, వివాదాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వెలువడిన వార్తలు దేశాన్ని కలచివేశాయని ఆయన అన్నారు. అలాంటి విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం, మానసిక సహాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందించిందో దేశ ప్రజలకు వెల్లడించాలని కోరారు.
పేపర్ లీక్‌ల వల్ల నిజాయితీగా చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, అవినీతిరహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జావిద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు.
దేశ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడే పరిస్థితిని ఇకపై సహించబోమని, విద్యార్థులకు న్యాయం చేయడం, పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని జావిద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వం : జావిద్ అలీ ఖాన్
తీవ్రంగా ఖండించిన న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు ఆసిఫాబాద్, జూలై 4: దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు జావిద్ అలీ ఖాన్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడి సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా 89కు పైగా ప్రధాన పరీక్షల పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి రావడం అత్యంత ఆందోళనకరమని జావిద్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిపై చార్జ్‌షీట్లు దాఖలు చేశారు, ఎంతమందికి కోర్టులు శిక్షలు విధించాయనే వివరాలను శ్వేతపత్రం రూపంలో దేశ ప్రజలకు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వంటి ఘటనలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. పేపర్ లీక్‌ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి, వారికి రాజకీయ లేదా అధికార పరమైన రక్షణ కల్పించకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, అనిశ్చితి, వివాదాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వెలువడిన వార్తలు దేశాన్ని కలచివేశాయని ఆయన అన్నారు. అలాంటి విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం, మానసిక సహాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందించిందో దేశ ప్రజలకు వెల్లడించాలని కోరారు. పేపర్ లీక్‌ల వల్ల నిజాయితీగా చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, అవినీతిరహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జావిద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. దేశ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడే పరిస్థితిని ఇకపై సహించబోమని, విద్యార్థులకు న్యాయం చేయడం, పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని జావిద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు.

