కల్లూరు/ ఖమ్మం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి, పెద్ద కోరుకొండి, చెన్నూరు, ఎర్రబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని అర్హులకు కార్డులు అందజేశారు. స్మార్ట్ రేషన్ కార్డు పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేందుకు ముఖ్యమైన ఆధారమన్నారు. సన్నబియ్యం పంపిణీతో ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్‌ఓసీలు అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెన్నూరులో కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడటం అభివృద్ధిలో ముందడుగన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నీరజా ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు పొట్రూ అర్జున్‌రావు, మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



