డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జోన్–2 ఇన్‌చార్జ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గారిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి గొల్లపల్లి అమూల్య గారు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం పి.గన్నవరం నియోజకవర్గ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన శ్రీ మోకా ఆనంద్ సాగర్ గారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు అనుచూరి పురుషోత్తం, అడబాల సాయి, తాడి సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ కాకి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



