చిట్వేల్ మండలంలోని రైతులందరూ వచ్చే విడత పీఎం కిసాన్ నగదు ప్రయోజనం పొందేందుకు ఏపీఎఫ్‌ఆర్‌లో ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి జి. సుధాకర్ తెలిపారు. పీఎం కిసాన్ పొందుతున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఫార్మర్ ఐడీ లేని రైతులు, ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన వారు తమ పరిధిలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ-కేవైసీని మీ సేవ, సీఎస్సీ కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చని తెలిపారు.పీఎం కిసాన్తో పాటు రైతులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఫార్మర్ ఐడీ కోసం ఆధార్ జిరాక్స్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్లాలని సూచించారు.

పీఎం కిసాన్‌కు ఫార్మర్ ఐడీ, ఈ-కేవైసీ తప్పనిసరి
చిట్వేల్ మండలంలోని రైతులందరూ వచ్చే విడత పీఎం కిసాన్ నగదు ప్రయోజనం పొందేందుకు ఏపీఎఫ్‌ఆర్‌లో ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి జి. సుధాకర్ తెలిపారు. పీఎం కిసాన్ పొందుతున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ ఐడీ లేని రైతులు, ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన వారు తమ పరిధిలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ-కేవైసీని మీ సేవ, సీఎస్సీ కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చని తెలిపారు.పీఎం కిసాన్తో పాటు రైతులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఫార్మర్ ఐడీ కోసం ఆధార్ జిరాక్స్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్లాలని సూచించారు.

