ఖమ్మం: వియత్నాం దేశ విద్యావ్యవస్థ, బోధనా పద్ధతులను పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి 32 మంది ఉపాధ్యాయులు, అధికారులతో కూడిన బృందం పర్యటించనుంది. ఈ బృందంలో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు అవకాశం లభించింది. కల్లూరు మండలం చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు దిగుమర్తి శిరీష, సింగరేణి మండలం పేరుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డి. జయరాజు ఎంపికయ్యారు. అక్టోబర్ 10 నుంచి 17వ తేదీ వరకు బృందం వియత్నాంలో పర్యటించనుంది. అక్కడి బోధనా విధానాలు, పాఠశాలల నిర్వహణ, పరీక్షల విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.



