Saturday, 26 September 2026
  • Home  
  • AIKMS మహాసభలను జయప్రదం చేయాలి
- ఖమ్మం

AIKMS మహాసభలను జయప్రదం చేయాలి

16 గ్రామాల్లో 60 మోటార్‌సైకిళ్లతో ప్రచార ర్యాలీ తిరుమలాయపాలెం: AIKMS జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సుమారు 60 మోటార్‌సైకిళ్లతో ర్యాలీ చేపట్టి 16 గ్రామాల్లో ప్రజలకు మహాసభలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా AIKMS మాజీ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 28న ఖమ్మంలో పేవిలియన్ గ్రౌండ్ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు రైతు కూలీల భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల ప్రజలు, రైతు కూలీలు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, AIKMS నాయకులు వీరస్వామి, అచ్చ ఉప్పలయ్య, నాగయ్య, బ్రహ్మచారి, పట్టాభి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

16 గ్రామాల్లో 60 మోటార్‌సైకిళ్లతో ప్రచార ర్యాలీ

తిరుమలాయపాలెం: AIKMS జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సుమారు 60 మోటార్‌సైకిళ్లతో ర్యాలీ చేపట్టి 16 గ్రామాల్లో ప్రజలకు మహాసభలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా AIKMS మాజీ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 28న ఖమ్మంలో పేవిలియన్ గ్రౌండ్ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు రైతు కూలీల భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల ప్రజలు, రైతు కూలీలు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, AIKMS నాయకులు వీరస్వామి, అచ్చ ఉప్పలయ్య, నాగయ్య, బ్రహ్మచారి, పట్టాభి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.