Wednesday, 30 September 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాలల్లో బాలల భద్రత ఆరోగ్యం హక్కులపై అవగాహనకు ప్రత్యేక చర్యలు
- జనగాం

ప్రభుత్వ పాఠశాలల్లో బాలల భద్రత ఆరోగ్యం హక్కులపై అవగాహనకు ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో బాలల భద్రత, ఆరోగ్యం, హక్కులపై అవగాహనకు ప్రత్యేక చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ————————————————————————– *ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 15 పోస్టర్లు.. మూడు రకాల బ్యానర్లు అందజేత* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాసిక ఆరోగ్యం–పరిశుభ్రత, పాఠశాల భద్రత, బాలల హక్కులు–శరీర భద్రత, పోక్సో చట్టం, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన పోస్టర్లు, బ్యానర్లను ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అందజేయడం జరిగిందని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మొత్తం 15 పోస్టర్లు అందజేయగా, ఇందులో మూడు రకాల పోస్టర్లను 5 చొప్పున పంపిణీ చేశామన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలకు మూడు రకాల అవగాహన బ్యానర్లు కూడా అందజేశామని వెల్లడించారు. *నా ఆరోగ్యం – నా ఆత్మవిశ్వాసం* “My Period • My Health • My Confidence” పేరుతో రూపొందించిన పోస్టర్ల ద్వారా రుతుక్రమం సహజమైన ప్రక్రియ అని, దీనిపై సిగ్గుపడాల్సిన అవసరం లేదని, సరైన అవగాహన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలియజేస్తుందన్నారు. శుభ్రమైన శానిటరీ ప్యాడ్ లను వినియోగించడం, వాటిని మార్చే ముందు–తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఉపయోగించిన సామగ్రిని సురక్షితంగా పారవేయడం, ప్యాడ్లను టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడదని వివరించారు. అలాగే తీవ్ర నొప్పి, అధిక రక్తస్రావం, తల తిరగడం (లేదా) మూర్ఛ, జ్వరం, దురద, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, విశ్వసనీయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎం/ఆశా (లేదా) సమీప ఆరోగ్య కేంద్రం ద్వారా సహాయం పొందాలని సూచించారు. తోటి విద్యార్థినులను ఎగతాళి చేయకుండా, వారి గోప్యతను గౌరవిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేయాలని, ప్రతి పాఠశాలలో పీరియడ్-ఫ్రెండ్లీ సదుపాయాలు ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. *పాఠశాలల భద్రత* “EVERY CHILD. EVERY DAY. EVERYWHERE.” అనే సందేశంతో రూపొందించిన పాఠశాల భద్రత పోస్టర్లలో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడం, పిడుగులు పడే సమయంలో భవనంలోకి వెళ్లడం, భూకంప సమయంలో వంగి–రక్షణ పొంది–పట్టుకోవడం వంటి ప్రాథమిక భద్రతా చర్యలను తెలియజేస్తుందన్నారు. అగ్ని, భూకంపం, పిడుగులు–తుఫాన్లు, వరదలు, ఎండ వేడి, విద్యుత్–గ్యాస్–ల్యాబ్ ప్రమాదాలు, తరగతి గదులు–ఆట స్థలాల భద్రత, రోడ్లు–బస్సులు–పర్యటనల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పోస్టర్లలో పొందుపరిచారు. అదే విధంగా ఆన్‌లైన్ భద్రత, ఆరోగ్యం–ఆహారం–పరిశుభ్రత, మాసిక గౌరవం, ప్రథమ చికిత్స, కాలిన గాయాలు, జంతువుల కాట్లు, పాము కాటు, విషపదార్థాలు, అందరికీ భద్రత–సిద్ధత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పోస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 – అత్యవసర సహాయం, 101 – అగ్నిమాపక సహాయం, 108 – అంబులెన్స్, 1098 – బాలల సహాయవాణి నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. *నా శరీరం – నా హక్కు – నా భద్రత* “My Body. My Rights. My Safety.” పేరుతో రూపొందించిన పోస్టర్ల ద్వారా విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, వ్యక్తిగత హద్దులు, బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తుందన్నారు. తమ శరీరంపై తమకే హక్కు ఉందని, ఇష్టం లేని కౌగిలింత, స్పర్శను తిరస్కరించే హక్కు ప్రతి చిన్నారికి ఉందని తెలియజేశారు. వ్యక్తిగత భాగాల గోప్యతను కాపాడుకోవడం, అనుమానాస్పద (లేదా) అసురక్షిత స్పర్శ, బెదిరింపులు, వ్యక్తిగత చిత్రాలకు సంబంధించిన విషయాలను నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. “వద్దు – భద్రత – చెప్పండి” అనే సందేశంతో, సురక్షిత ప్రదేశానికి వెళ్లడం, సహాయం అందేవరకు నమ్మకమైన పెద్దలకు విషయం తెలియజేస్తూ ఉండాలని వివరించారు. అసురక్షిత పరిస్థితిలో భయంతో స్పందించలేకపోయినా, ఆలస్యంగా చెప్పినా అది బాలల తప్పు కాదని, వారికి సహాయం అందాల్సిందేననే భరోసాను కల్పించేలా పోస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత చిత్రాలను పంపకూడదని, బెదిరింపులకు డబ్బులు చెల్లించకూడదని, హానికరమైన పరిచయాలను బ్లాక్ చేసి, రిపోర్ట్ చేసి, పెద్దల సహాయం పొందాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారిని రక్షించే పోక్సో చట్టం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, లైంగిక చిత్రాలకు సంబంధించిన నేరాలను పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సహాయం అందించే నమ్మకమైన వ్యక్తిని, ప్రత్యామ్నాయ సహాయక వ్యక్తిని గుర్తించడం, న్యాయ సహాయం పొందే అవకాశాలపై కూడా అవగాహన కల్పిస్తుందన్నారు. *విద్యార్థుల భద్రతకు సమగ్ర అవగాహన* పాఠశాల అనేది విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాల్సిన ప్రదేశమనే ఉద్దేశంతో ఈ అవగాహన పోస్టర్లు, బ్యానర్లను రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి తన ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కలిగి ఉండేలా పాఠశాలల్లో వీటిని ప్రదర్శించాలని సూచించారు. “మన భద్రత – మన బాధ్యత”, “మీరు ఒంటరివారు కాదు. అది మీ తప్పు కాదు”, వంటి సందేశాల ద్వారా విద్యార్థుల్లో భద్రత, గౌరవం, పరస్పర సహకారం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అవగాహన కల్పిస్తుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో బాలల భద్రత, ఆరోగ్యం, హక్కులపై అవగాహనకు ప్రత్యేక చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
————————————————————————–
*ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 15 పోస్టర్లు.. మూడు రకాల బ్యానర్లు అందజేత*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాసిక ఆరోగ్యం–పరిశుభ్రత, పాఠశాల భద్రత, బాలల హక్కులు–శరీర భద్రత, పోక్సో చట్టం, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన పోస్టర్లు, బ్యానర్లను ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అందజేయడం జరిగిందని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మొత్తం 15 పోస్టర్లు అందజేయగా, ఇందులో మూడు రకాల పోస్టర్లను 5 చొప్పున పంపిణీ చేశామన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలకు మూడు రకాల అవగాహన బ్యానర్లు కూడా అందజేశామని వెల్లడించారు.
*నా ఆరోగ్యం – నా ఆత్మవిశ్వాసం*
“My Period • My Health • My Confidence” పేరుతో రూపొందించిన పోస్టర్ల ద్వారా రుతుక్రమం సహజమైన ప్రక్రియ అని, దీనిపై సిగ్గుపడాల్సిన అవసరం లేదని, సరైన అవగాహన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలియజేస్తుందన్నారు.
శుభ్రమైన శానిటరీ ప్యాడ్ లను వినియోగించడం, వాటిని మార్చే ముందు–తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఉపయోగించిన సామగ్రిని సురక్షితంగా పారవేయడం, ప్యాడ్లను టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడదని వివరించారు.
అలాగే తీవ్ర నొప్పి, అధిక రక్తస్రావం, తల తిరగడం (లేదా) మూర్ఛ, జ్వరం, దురద, అసౌకర్యం వంటి సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, విశ్వసనీయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎం/ఆశా (లేదా) సమీప ఆరోగ్య కేంద్రం ద్వారా సహాయం పొందాలని సూచించారు.
తోటి విద్యార్థినులను ఎగతాళి చేయకుండా, వారి గోప్యతను గౌరవిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేయాలని, ప్రతి పాఠశాలలో పీరియడ్-ఫ్రెండ్లీ సదుపాయాలు ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.
*పాఠశాలల భద్రత*
“EVERY CHILD. EVERY DAY. EVERYWHERE.” అనే సందేశంతో రూపొందించిన పాఠశాల భద్రత పోస్టర్లలో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అగ్ని ప్రమాదం సంభవిస్తే బయటకు వెళ్లడం, పిడుగులు పడే సమయంలో భవనంలోకి వెళ్లడం, భూకంప సమయంలో వంగి–రక్షణ పొంది–పట్టుకోవడం వంటి ప్రాథమిక భద్రతా చర్యలను తెలియజేస్తుందన్నారు.
అగ్ని, భూకంపం, పిడుగులు–తుఫాన్లు, వరదలు, ఎండ వేడి, విద్యుత్–గ్యాస్–ల్యాబ్ ప్రమాదాలు, తరగతి గదులు–ఆట స్థలాల భద్రత, రోడ్లు–బస్సులు–పర్యటనల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పోస్టర్లలో పొందుపరిచారు.
అదే విధంగా ఆన్‌లైన్ భద్రత, ఆరోగ్యం–ఆహారం–పరిశుభ్రత, మాసిక గౌరవం, ప్రథమ చికిత్స, కాలిన గాయాలు, జంతువుల కాట్లు, పాము కాటు, విషపదార్థాలు, అందరికీ భద్రత–సిద్ధత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పోస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 112 – అత్యవసర సహాయం, 101 – అగ్నిమాపక సహాయం, 108 – అంబులెన్స్, 1098 – బాలల సహాయవాణి నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
*నా శరీరం – నా హక్కు – నా భద్రత*
“My Body. My Rights. My Safety.” పేరుతో రూపొందించిన పోస్టర్ల ద్వారా విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, వ్యక్తిగత హద్దులు, బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తుందన్నారు.
తమ శరీరంపై తమకే హక్కు ఉందని, ఇష్టం లేని కౌగిలింత, స్పర్శను తిరస్కరించే హక్కు ప్రతి చిన్నారికి ఉందని తెలియజేశారు. వ్యక్తిగత భాగాల గోప్యతను కాపాడుకోవడం, అనుమానాస్పద (లేదా) అసురక్షిత స్పర్శ, బెదిరింపులు, వ్యక్తిగత చిత్రాలకు సంబంధించిన విషయాలను నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు.
“వద్దు – భద్రత – చెప్పండి” అనే సందేశంతో, సురక్షిత ప్రదేశానికి వెళ్లడం, సహాయం అందేవరకు నమ్మకమైన పెద్దలకు విషయం తెలియజేస్తూ ఉండాలని వివరించారు.
అసురక్షిత పరిస్థితిలో భయంతో స్పందించలేకపోయినా, ఆలస్యంగా చెప్పినా అది బాలల తప్పు కాదని, వారికి సహాయం అందాల్సిందేననే భరోసాను కల్పించేలా పోస్టర్లను రూపొందించడం జరిగిందన్నారు.
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత చిత్రాలను పంపకూడదని, బెదిరింపులకు డబ్బులు చెల్లించకూడదని, హానికరమైన పరిచయాలను బ్లాక్ చేసి, రిపోర్ట్ చేసి, పెద్దల సహాయం పొందాలని సూచించారు.
18 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారిని రక్షించే పోక్సో చట్టం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, లైంగిక చిత్రాలకు సంబంధించిన నేరాలను పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తుందన్నారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సహాయం అందించే నమ్మకమైన వ్యక్తిని, ప్రత్యామ్నాయ సహాయక వ్యక్తిని గుర్తించడం, న్యాయ సహాయం పొందే అవకాశాలపై కూడా అవగాహన కల్పిస్తుందన్నారు.
*విద్యార్థుల భద్రతకు సమగ్ర అవగాహన*
పాఠశాల అనేది విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాల్సిన ప్రదేశమనే ఉద్దేశంతో ఈ అవగాహన పోస్టర్లు, బ్యానర్లను రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి తన ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కలిగి ఉండేలా పాఠశాలల్లో వీటిని ప్రదర్శించాలని సూచించారు.
“మన భద్రత – మన బాధ్యత”, “మీరు ఒంటరివారు కాదు. అది మీ తప్పు కాదు”, వంటి సందేశాల ద్వారా విద్యార్థుల్లో భద్రత, గౌరవం, పరస్పర సహకారం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అవగాహన కల్పిస్తుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.