ఎల్బీనగర్: ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి టీవీఎస్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. టీవీఎస్ మోటార్ కంపెనీ సౌత్ జోనల్ మేనేజర్ (సేల్స్) కేంద్రజ్ జోషి, రీజినల్ మేనేజర్ (సేల్స్) సుప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి వంగా, కుటుంబ సభ్యులతో కలిసి దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీవీఎస్ మోటార్ కంపెనీ రీజినల్ మేనేజర్ (సర్వీస్) బినోయ్ కుమార్ ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.
అలాగే టీవీఎస్ ఏరియా మేనేజర్ (సేల్స్) గౌరవ్ మాలిక్ ఆధ్వర్యంలో స్పేర్ పార్ట్స్ కౌంటర్‌ను ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన వాహనాలు, మెరుగైన సర్వీస్, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అందించడమే లక్ష్యంగా శ్రీ లక్ష్మి టీవీఎస్ షోరూమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రతినిధులు, షోరూమ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, వినియోగదారులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నూతన షోరూమ్ నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



