వెల్దుర్తి పోలీస్ స్టేషన్ను కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలు, అక్కడి పరిస్థితులు, గ్రౌండ్ లెవల్ పరిస్థితులపై వెల్దుర్తి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలింగ్ కేంద్రాలు, పోలీస్ పికెట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎస్సై నరేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్