నంద్యాల : మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి టి. నాగలక్ష్మి తెలిపారు. 80 శాతం లైసెన్సులు పునరుద్ధరించగా రూ.36.32 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.నంద్యాల, కర్నూలు పరిధిలో 27 ఖాళీ దుకాణాలకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో డ్రా నిర్వహిస్తామన్నారు. రాజకీయాలు, సిండికేట్ల జోక్యాన్ని సహించబోమని, బెదిరింపులు ఎదురైతే జిల్లా అధికారి ఎస్. రవికుమార్‌ను 8008828467 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఏపీ ఎక్సైజ్ యాప్, ఏఐ ఆధారిత సీసీటీవీలతో నిఘా పెంచుతున్నట్లు నాగలక్ష్మి తెలిపారు.

మద్యం దుకాణాల దరఖాస్తుల్లో పారదర్శకత