Thursday, 24 September 2026
  • Home  
  • తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం
- ఖమ్మం

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం

లారీ ఢీకొనడంతో పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 24: తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక నిమజ్జన బందోబస్తు విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి భవాని హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎస్సై జగదీష్, డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ రాకేష్‌కు తలకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

లారీ ఢీకొనడంతో పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 24: తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక నిమజ్జన బందోబస్తు విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి భవాని హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఎస్సై జగదీష్, డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ రాకేష్‌కు తలకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ప్రమాదం అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, లారీ వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.