Saturday, 19 September 2026
  • Home  
  • ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వర్ణాంధ్ర – స్వచ్చ ఆంధ్ర వేడుకలు
- తిరుపతి

ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వర్ణాంధ్ర – స్వచ్చ ఆంధ్ర వేడుకలు

గూడూరు. సెప్టెంబరు 19 ( పున్నమి ప్రతినిధి ) : నెల్లూరు జిల్లా గూడూరులోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వఛ్చ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది.శనివారం నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పారిశుధ్యం పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యం మరియు మేధో వికాసం కలుగుతుందని దానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలువురు వక్తలు కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ సిబ్బంది కళాశాల పరిసరాలను శుభ్రం చేసారు. విద్యార్థులు తరగతులను ప్రయోగ శాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులు కళాశాల సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, సాసా కో ఆర్డినేటర్ ప్రసాద్, గోవిందు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

గూడూరు. సెప్టెంబరు 19 ( పున్నమి ప్రతినిధి ) :
నెల్లూరు జిల్లా గూడూరులోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వఛ్చ ఆంధ్ర
కార్యక్రమం ఘనంగా జరిగింది.శనివారం నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో
జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పారిశుధ్యం పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యం మరియు మేధో వికాసం కలుగుతుందని దానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలువురు వక్తలు కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ సిబ్బంది కళాశాల పరిసరాలను శుభ్రం చేసారు. విద్యార్థులు తరగతులను ప్రయోగ శాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులు కళాశాల సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, సాసా కో ఆర్డినేటర్ ప్రసాద్, గోవిందు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.