పెనుబల్లి / ఖమ్మం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొండ్రుపాడు గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహణకు వేలం పాట నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలోనే వేలం నిర్వహించడం స్థానికంగా చర్చకు దారితీసింది. బెల్ట్‌షాపు నిర్వహణకు తీవ్ర పోటీ నెలకొనడంతో వేలం నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు, నలుగురు పోటీపడగా ఓ వ్యాపారి రూ.2.10 లక్షలకు వేలం దక్కించుకున్నట్లు సమాచారం. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని దేవాలయాల అభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తామని గ్రామ పెద్దలు తెలిపినట్లు తెలిసింది. అయితే, ఆలయంలోనే బెల్ట్‌షాపు వేలం నిర్వహించడంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



