ఖమ్మం నుంచి సత్తుపల్లి, భద్రాచలం వెళ్లే డీలక్స్ బస్సుల్లో నేటి నుంచి ఎక్స్ప్రెస్ చార్జీలు మాత్రమే వర్తిస్తాయని ఖమ్మం డిపో మేనేజర్ ఓ వర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం–భద్రాచలం డీలక్స్ బస్సు చార్జీ రూ.180 ఉండగా, దానిని రూ.170కు తగ్గించినట్లు వెల్లడించారు. అలాగే ఖమ్మం–సత్తుపల్లి డీలక్స్ బస్సు చార్జీ రూ.130 నుంచి రూ.120కు తగ్గించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు చార్జీల తగ్గింపును గమనించి, డీలక్స్ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని డిపో మేనేజర్ ఓ వర ప్రసాద్ కోరారు.



