హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను పూర్తిగా రద్దు చేయకుండా ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో కొనసాగించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఒకే ఇంటి నంబర్లో వేర్వేరు పొయ్యిలతో జీవిస్తున్న కుటుంబాలను ఒకే కుటుంబంగా పరిగణిస్తే అర్హులైన వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు ఎలా అందుతాయని ప్రశ్నించారు. భూమి ఉందనే కారణంతో గతంలో తిరస్కరించిన పెన్షన్లను పునఃపరిశీలించి, స్పష్టమైన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ లేదంటూ అధికారులు ప్రజలను తిప్పి పంపుతున్న పరిస్థితిని ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పేర్లు మార్చడం కాకుండా విధానం మార్చి, వయస్సు, వాస్తవ పేదరికం, కుటుంబ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. మ్యాపింగ్ కారణంగా తిరస్కరించిన పెన్షన్లను గ్రామసభల ద్వారా పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.

హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రద్దు చేయాలి: కాంగ్రస్ నాయకులు వెంగడ నీలకంఠం