రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన కోసం కాదు.. ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచం. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
ఒక్క వ్యక్తికి ప్రమాదం జరిగినా దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బంధుమిత్రులు తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ పోషణ, పిల్లల చదువులు వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి.
“ఇంటికి వెళ్లే వరకు హెల్మెట్ తీయొద్దు.. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు” అనే విషయాన్ని ప్రతి ద్విచక్ర వాహనదారుడు గుర్తుంచుకోవాలి. కొద్దిదూరమే కదా అని హెల్మెట్ లేకుండా వెళ్లడం, తొందరలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి నిర్లక్ష్యం ఒక్క క్షణంలో జీవితాన్ని మార్చివేయవచ్చు.
ప్రతి వాహనదారుడు తాను హెల్మెట్ ధరించడంతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు కూడా హెల్మెట్ ధరించేలాఅవగాహన కల్పించాలి. మన కోసం మన కుటుంబం ఎదురుచూస్తోంది.. సురక్షితంగా ఇంటికి చేరడం మన బాధ్యత..
హెల్మెట్ ధరించండి.. వేగాన్ని నియంత్రించండి.. ప్రాణాలను కాపాడుకుందాం🙏🙏

హెల్మెంట్ లేకుండా ప్రయాణం.. ప్రమాదానికి ఆహ్వానం – ఒక్క ప్రమాదంతో కుటుంబం మొత్తం కన్నీటిపాలు..
రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన కోసం కాదు.. ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచం. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఒక్క వ్యక్తికి ప్రమాదం జరిగినా దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బంధుమిత్రులు తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ పోషణ, పిల్లల చదువులు వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి. “ఇంటికి వెళ్లే వరకు హెల్మెట్ తీయొద్దు.. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు” అనే విషయాన్ని ప్రతి ద్విచక్ర వాహనదారుడు గుర్తుంచుకోవాలి. కొద్దిదూరమే కదా అని హెల్మెట్ లేకుండా వెళ్లడం, తొందరలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి నిర్లక్ష్యం ఒక్క క్షణంలో జీవితాన్ని మార్చివేయవచ్చు. ప్రతి వాహనదారుడు తాను హెల్మెట్ ధరించడంతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు కూడా హెల్మెట్ ధరించేలాఅవగాహన కల్పించాలి. మన కోసం మన కుటుంబం ఎదురుచూస్తోంది.. సురక్షితంగా ఇంటికి చేరడం మన బాధ్యత.. హెల్మెట్ ధరించండి.. వేగాన్ని నియంత్రించండి.. ప్రాణాలను కాపాడుకుందాం🙏🙏

