Wednesday, 30 September 2026
  • Home  
  • హస్తినాపురం నారాయణ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన
- రంగారెడ్డి

హస్తినాపురం నారాయణ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన

హస్తినాపురం నారాయణ పాఠశాలలో ఈ-కిడ్జ్‌ విద్యార్థుల స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. పీ.పీ.-1, పీ.పీ.-2 విద్యార్థులు ప్రథమ టర్మ్‌లో వివిధ సబ్జెక్టుల్లో తాము నేర్చుకున్న అంశాలను బోధనాసామగ్రి, ఆటల ద్వారా తల్లిదండ్రులకు స్వయంగా వివరించారు. ఉపాధ్యాయుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా విద్యార్థులే అన్ని అంశాలను వివరించడం తల్లిదండ్రులను ఆకట్టుకుంది. పాఠశాలలో ప్రతిరోజూ ఆడే ఆటలను సైతం విద్యార్థులు తల్లిదండ్రులతో ఆడించారు. డిజిటల్‌ బోర్డు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ పొంగూరు రమాదేవి విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దిల్సుఖ్‌నగర్‌ జోన్‌ ఏజీఎం హేమెంబెర్‌ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారో తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ ఉపాధ్యాయుల సహకారంతో అన్ని సబ్జెక్టులను మెరుగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐ రవి ప్రసాద్‌, ఈ-కిడ్జ్‌ ఆర్‌అండ్‌డీ హెడ్‌ మీనా, కోఆర్డినేటర్‌ శిరీష, ప్రిన్సిపాల్‌ జి.వి.లక్ష్మి శారద, వైస్‌ ప్రిన్సిపాల్‌ శిల్ప, ఏవోలు రాజేష్‌, కరుణాకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

హస్తినాపురం నారాయణ పాఠశాలలో ఈ-కిడ్జ్‌ విద్యార్థుల స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. పీ.పీ.-1, పీ.పీ.-2 విద్యార్థులు ప్రథమ టర్మ్‌లో వివిధ సబ్జెక్టుల్లో తాము నేర్చుకున్న అంశాలను బోధనాసామగ్రి, ఆటల ద్వారా తల్లిదండ్రులకు స్వయంగా వివరించారు. ఉపాధ్యాయుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా విద్యార్థులే అన్ని అంశాలను వివరించడం తల్లిదండ్రులను ఆకట్టుకుంది. పాఠశాలలో ప్రతిరోజూ ఆడే ఆటలను సైతం విద్యార్థులు తల్లిదండ్రులతో ఆడించారు.
డిజిటల్‌ బోర్డు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ పొంగూరు రమాదేవి విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దిల్సుఖ్‌నగర్‌ జోన్‌ ఏజీఎం హేమెంబెర్‌ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారో తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ ఉపాధ్యాయుల సహకారంతో అన్ని సబ్జెక్టులను మెరుగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐ రవి ప్రసాద్‌, ఈ-కిడ్జ్‌ ఆర్‌అండ్‌డీ హెడ్‌ మీనా, కోఆర్డినేటర్‌ శిరీష, ప్రిన్సిపాల్‌ జి.వి.లక్ష్మి శారద, వైస్‌ ప్రిన్సిపాల్‌ శిల్ప, ఏవోలు రాజేష్‌, కరుణాకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.