రంగారెడ్డి జిల్లా: మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.
తీన్మార్ మల్లన్న మద్దతుతో, గ్రేటర్ హైదరాబాద్ గౌరవాధ్యక్షులు టివిఆర్ నాయకత్వంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు, కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు.



