Wednesday, 1 July 2026
  • Home  
  • సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా భూక్యా వినోద్ కుమార్
- ఖమ్మం

సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా భూక్యా వినోద్ కుమార్

*సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా భూక్యా వినోద్ కుమార్* ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామానికి చెందిన భుక్యా వినోద్ కుమార్ ఖమ్మం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే భూక్యా వినోద్ కుమార్ కు కో కన్వీనర్ గా కీలక బాధ్యతలు దక్కాయి. సేవాలాల్ సేన కేంద్ర కమిటీ (తెలంగాణ రాష్ట్రం) ఆయనను ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ హుస్సేన్ నాయక్ మరియు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ గారి ఆదేశాల మేరకు జిల్లా గౌరవ అధ్యక్షులు భుక్యా నరసింహారావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, వినోద్ కుమార్ అనుభవం మరియు నాయకత్వ పటిమతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని కమిటీ ఆకాంక్షించింది. ఈ సందర్భంగా భుక్యా వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. జాతి ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర మరియు జాతీయ నాయకుల సూచనలను పాటిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. భుక్యా వినోద్ కుమార్ గారి నియామకం పట్ల స్థానిక నాయకులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

*సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా భూక్యా వినోద్ కుమార్*

ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామానికి చెందిన భుక్యా వినోద్ కుమార్ ఖమ్మం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే భూక్యా వినోద్ కుమార్ కు కో కన్వీనర్ గా కీలక బాధ్యతలు దక్కాయి. సేవాలాల్ సేన కేంద్ర కమిటీ (తెలంగాణ రాష్ట్రం) ఆయనను ఖమ్మం జిల్లా కో కన్వీనర్ గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ హుస్సేన్ నాయక్ మరియు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ గారి ఆదేశాల మేరకు జిల్లా గౌరవ అధ్యక్షులు భుక్యా నరసింహారావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, వినోద్ కుమార్ అనుభవం మరియు నాయకత్వ పటిమతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని కమిటీ ఆకాంక్షించింది.
ఈ సందర్భంగా భుక్యా వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. జాతి ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర మరియు జాతీయ నాయకుల సూచనలను పాటిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. భుక్యా వినోద్ కుమార్ గారి నియామకం పట్ల స్థానిక నాయకులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.