సింగరేణి కాలరీస్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. 1997 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 90 వేల మంది ఉద్యోగుల్లో 128 మంది మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. చట్టపరమైన చిక్కుల కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగేస్తున్న నేపథ్యంలో, ఏ ఒక్క అధికారిపై భారం పడకుండా కమిటీ సిఫార్సుల ఆధారంగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని భట్టి స్పష్టం చేశారు

సింగరేణి మారుపేర్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం