Sunday, 16 August 2026
  • Home  
  • సావన్ మిత్రా స్కూల్ విద్యార్థుల ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు
- విశాఖపట్నం

సావన్ మిత్రా స్కూల్ విద్యార్థుల ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు

విశాఖపట్నం జిల్లా,ఆనందపురo మండలం (పున్నమి ప్రతినిధి)ఆగస్టు 15: గిడిజాల గ్రామంలో గల సావన్ మిత్రా స్కూల్ విద్యార్థులు యోగా విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు పి. శ్రీచరణ్, ఎం. హర్ష, ఎల్. సాయి దనుష్ అమరావతి ఛాంపియన్‌షిప్‌ (యోగా)లో విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికై, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకితభావం పాఠశాలకు గర్వకారణంగా నిలిచాయని సావన్ మిత్రా స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విద్యతో పాటు క్రీడలు, యోగా, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పాఠశాలలో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, విశాఖపట్నం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు

విశాఖపట్నం జిల్లా,ఆనందపురo మండలం (పున్నమి ప్రతినిధి)ఆగస్టు 15:
గిడిజాల గ్రామంలో గల సావన్ మిత్రా స్కూల్ విద్యార్థులు యోగా విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు పి. శ్రీచరణ్, ఎం. హర్ష, ఎల్. సాయి దనుష్ అమరావతి ఛాంపియన్‌షిప్‌ (యోగా)లో విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికై, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకితభావం పాఠశాలకు గర్వకారణంగా నిలిచాయని సావన్ మిత్రా స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విద్యతో పాటు క్రీడలు, యోగా, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పాఠశాలలో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది.

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, విశాఖపట్నం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.