సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉల్లాసంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులతో కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలతో జాతీయ జెండాకు వందనం సమర్పించారు. కార్యక్రమంలో నంబూరు రామలింగేశ్వరరావు, సుదర్శన్ మిశ్రా, సాలి శివ, వీరం రాజు, బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, నాయుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు.



