సంగం: సంగం జెడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు ‘జ్ఞాన జ్యోతి’ కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ జానకీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో నవచేతన, ఆధారశిల అంశాలపై టీచర్లకు అవగాహన కల్పించారు. మొత్తం ఆరు రోజుల పాటు శిక్షణ కొనసాగనుండగా, ఆగస్టు 22, 24, 25 తేదీల్లో మరో మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, పోషణ–ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన అభ్యసన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించడమే ‘జ్ఞాన జ్యోతి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సునీలత, సూపర్‌వైజర్ రమాదేవితో పాటు DRP లు పలువురు అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంగంలో అంగన్వాడీ టీచర్లకు ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణ