శ్రీకాళహస్తి, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో దసరా ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, మాతాజీలు, కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు. పూజ కార్యక్రమం అనంతరం పిల్లలు కోలాటం, అమ్మవారి వేషధారణలు, నృత్యాలతో అలరించారు. పాఠశాల అధ్యక్షుడు చాగణం భక్తవత్సలయ్య తెలిపారు, పిల్లల్లో పండుగలు, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం అవసరమని, దైవభక్తి, గురుభక్తి, దేశభక్తిని పెంపొందించాల్సిన బాధ్యత టీచర్లదని చెప్పారు. సమితి కార్యదర్శి మంగిరెడ్డి, నేటి తరం పిల్లల్లో సంప్రదాయాల పట్ల ఆసక్తి తగ్గుతుందని, పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించడం అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరై పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చారు.


