Sunday, 16 August 2026
  • Home  
  • శ్రావణమాస మహోత్సవంలో ఘనంగా అన్నదానం
- కడప

శ్రావణమాస మహోత్సవంలో ఘనంగా అన్నదానం

శ్రావణమాస మహోత్సవంలో ఘనంగా అన్నదానం పున్నమి ప్రతినిధి – కడప: శ్రీ శ్రావణమాస మహోత్సవంలో భాగంగా మొదటి శనివారం కడప నగరంలోని ఇంద్రానగర్ సమీపంలో ఉన్న పాలకొండ రాయ దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ భద్రాద్రి రామాలయం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా KSRM కళాశాల చైర్మన్ కందుల నాని, AMR అధినేత రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. శ్రావణమాసంలో అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని, భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

శ్రావణమాస మహోత్సవంలో ఘనంగా అన్నదానం

పున్నమి ప్రతినిధి – కడప:
శ్రీ శ్రావణమాస మహోత్సవంలో భాగంగా మొదటి శనివారం కడప నగరంలోని ఇంద్రానగర్ సమీపంలో ఉన్న పాలకొండ రాయ దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

శ్రీ భద్రాద్రి రామాలయం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ ఏటూరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా KSRM కళాశాల చైర్మన్ కందుల నాని, AMR అధినేత రోహిత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. శ్రావణమాసంలో అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని, భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.