తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి),ఆగస్టు 13: పార్టీ కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా అంకితభావంతో పనిచేస్తూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి అండగా నిలిచిన పప్పుప్పల లక్ష్మణ్ (నాని)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో కీలక బాధ్యతలు దక్కాయి.
వైసీపీ అధ్యక్షులు, ప్రజా నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కొప్పూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పప్పుప్పల లక్ష్మణ్ (నాని)ను రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలు, చేసిన కృషి, అంకితభావాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాని తెలిపారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ, యువజన విభాగాన్ని మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నానికి రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి పదవి లభించడం పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నానిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పప్పుప్పల లక్ష్మణ్ (నాని)
తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి),ఆగస్టు 13: పార్టీ కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా అంకితభావంతో పనిచేస్తూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి అండగా నిలిచిన పప్పుప్పల లక్ష్మణ్ (నాని)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో కీలక బాధ్యతలు దక్కాయి. వైసీపీ అధ్యక్షులు, ప్రజా నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కొప్పూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పప్పుప్పల లక్ష్మణ్ (నాని)ను రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలు, చేసిన కృషి, అంకితభావాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాని తెలిపారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ, యువజన విభాగాన్ని మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నానికి రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి పదవి లభించడం పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నానిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

