Friday, 10 July 2026
  • Home  
  • వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 8 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కోదండరామాపురం జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 8 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కోదండరామాపురం జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.