ఖమ్మం, ఆగస్టు 3
( పున్నమి న్యూస్)
గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణుకుమార్‌కు మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సాయాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నామ ముత్తయ్య ట్రస్ట్ ప్రతినిధి కనకమేడల సత్యనారాయణ వేణుకుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని, వేణుకుమార్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


