Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

విషాద ఘటనతోనైనా మేల్కొనాలి.. పాకాలలో భద్రత పెంచాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విషాద ఘటనతోనైనా మేల్కొనాలి.. పాకాలలో భద్రత పెంచాలి

ఖానాపురం పున్నమి ప్రతినిధి. ఖానాపురం మండలంలోనిపాకాల సరస్సులో గతంలోనూ ప్రమాదాలు జరిగినప్పటికీ, పిల్లలతో కలిసి సరస్సులోకి దూకిన ఘటనలు ఇప్పటివరకు చూడలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
తాజా విషాద ఘటన నేపథ్యంలో సరస్సు ప్రాంగణంలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రవేశ ద్వారాలు, సరస్సు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షణ పెంచాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
పాకాల సరస్సు వరంగల్ జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. సెలవు రోజుల్లో, వారాంతాల్లో వందలాది మంది కుటుంబాలతో సహా ఇక్కడికి వస్తుంటారు. అయితే సరస్సులో నీటి లోతు ఎక్కువగా ఉండటం, ఎలాంటి హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లు, భద్రతా సిబ్బంది లేకపోవడం వల్ల ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విషాద ఘటనతోనైనా మేల్కొనాలి.. పాకాలలో భద్రత పెంచాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *