Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

గ్రామాల్లో పంచాయతీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రామాల్లో పంచాయతీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు.

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట (పున్నమి తెలుగు దినపత్రిక ) గ్రామాలలో పంచాయతీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెన్నారావుపేట ఎస్సై పొన్నాల గోవర్ధన్ తెలిపారు.
  • శుక్రవారం పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
  • గ్రామాలలో పంచాయతీల పేరుతో కొందరు పెద్దమనుషులు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తూ, జరిమానాలు విధిస్తూ అక్రమ పంచాయతీలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు.

చెన్నారావుపేట (పున్నమి తెలుగు దినపత్రిక )

గ్రామాలలో పంచాయతీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెన్నారావుపేట ఎస్సై పొన్నాల గోవర్ధన్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో పంచాయతీల పేరుతో కొందరు పెద్దమనుషులు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తూ, జరిమానాలు విధిస్తూ అక్రమ పంచాయతీలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, ఎవరికి కోర్టుల మాదిరిగా తీర్పులు ఇచ్చే అధికారం లేదని హెచ్చరించారు. డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడటం, మోసపూరితంగా వసూళ్లు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం, దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులు ఎవరైనా డిపాజిట్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా, అక్రమంగా జరిమానాలు విధించినా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై గోవర్దన్ హెచ్చరించారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *