Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నాటి స్నేహబంధం.. నేడు మానవత్వానికి ప్రతిరూపం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాటి స్నేహబంధం.. నేడు మానవత్వానికి ప్రతిరూపం

ఖానాపురం పున్నమి ప్రతినిధి.ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన 1989–90 పదో తరగతి బ్యాచ్ సహచరుడు ఓరుగంటి ప్రభాకర్ ఈ నెల 30-10-2026న మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తోటి పాత స్నేహితులు అండగా నిలిచారు.
ప్రభాకర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో క్లాస్‌మేట్స్ అందరూ కలిసి తమ వంతు సహాయంగా రూ.30,000 ఆర్థిక సాయం అందజేశారు.
చదువుకున్న నాటి స్నేహాన్ని మరువకుండా, ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన వారి మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొండ్లె మోహన్, జక్కి శ్రీనివాస్, మహాలక్ష్మి వెంకటేశ్వర్లు, ఎస్.కె. లాల్ సాహెబ్, పరిటాల నాగేశ్వరరావు, అర్కాల వెంకటస్వామి, గొల్లపల్లి వెంకటేశ్వర్లు తదితర క్లాస్‌మేట్స్ పాల్గొన్నారు.

నాటి స్నేహబంధం.. నేడు మానవత్వానికి ప్రతిరూపం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *