ఖానాపూర్ పున్నమి ప్రతినిధి: VB-G-RAMG పథకంలో భాగంగా మండలంలోని మేటీలకు శిక్షణ, నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో వి. అద్వైత మాట్లాడుతూ, గ్రామాల్లో కూలీలను పనులకు సమీకరించడంలో మేటీలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రతి గ్రామంలో పనులు నిరంతరం జరిగేలా చూడాల్సిన బాధ్యత మేటీలపైనే ఉందన్నారు.
శిక్షణలో చెప్పిన ముఖ్యాంశాలు:
1. స్మార్ట్ ఫోన్ వినియోగం:
పనుల నమోదు, హాజరు, ఫొటోలు అప్ లోడ్ చేయడంలో స్మార్ట్ ఫోన్ వినియోగంపై మేటీలకు అవగాహన పెంచుకోవాలన్నారు.
2. NMMS యాప్ ద్వారా హాజరు:
NMMS యాప్ ద్వారా హాజరు నమోదు విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు. హాజరు సరిగా నమోదు కాకపోతే వేతనం రావడంలో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.
3. పనుల కొలతలు, నాణ్యత:
పనుల కొలతలు సరిగ్గా తీసుకోవాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కూలీలకు వివరించాలని సూచించారు.
4. రోజువారీ వేతనం రూ.308:
కూలీలకు రోజువారీ వేతనం గరిష్ఠంగా రూ.308 పొందేలా కృషి చేయాలని మేటీలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేటీలు, పంచాయతీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
