దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షల తయారీలో ప్రముఖ స్థానం కలిగిన అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు విశాఖపట్నంలో తన శిఖరాన్ని విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖలో తరగతులను ప్రారంభిస్తున్న సందర్భంగా బుధవారం బీచ్ రోడ్‌లోని 101 ప్రాంతంలో వైజాగ్ బ్రోచర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ విశాఖలో స్థాపించబడటం గర్వకారణం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును మలుచుకోవాలి” అని తెలిపారు.
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.


