Wednesday, 24 June 2026
  • Home  
  • విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం.. నల్లగొండలో విషాదఛాయలు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం.. నల్లగొండలో విషాదఛాయలు!

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు లింగాలదిన్నె నర్సారెడ్డి (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన బోరు మోటార్ స్టార్టర్‌ను మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం పొలానికి వెళ్లిన నర్సారెడ్డి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టగా రాత్రి 10:30 గంటల సమయంలో పొలంలోని మోటార్ షెడ్లో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. విద్యుత్ షాక్ కారణంగానే ఆయన మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. నర్సారెడ్డి ఆకస్మిక మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న నర్సారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది.

వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు లింగాలదిన్నె నర్సారెడ్డి (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన బోరు మోటార్ స్టార్టర్‌ను మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం పొలానికి వెళ్లిన నర్సారెడ్డి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టగా రాత్రి 10:30 గంటల సమయంలో పొలంలోని మోటార్ షెడ్లో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. విద్యుత్ షాక్ కారణంగానే ఆయన మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. నర్సారెడ్డి ఆకస్మిక మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న నర్సారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.