Monday, 22 June 2026
  • Home  
  • విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం-శ్రీకాళహస్తిలో ముగిసిన స్పాట్ అడ్మిషన్లు
- తిరుపతి

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం-శ్రీకాళహస్తిలో ముగిసిన స్పాట్ అడ్మిషన్లు

శ్రీకాళహస్తి, మే 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి, మే 07 శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సమాజ కమ్యూనిటీ హాల్‌లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి డీమ్డ్ యూనివర్సిటీ ‘స్పాట్ అడ్మిషన్ల’ కార్యక్రమం గురువారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి సుమారు 25 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ఇంజనీరింగ్ వైపు విద్యార్థుల మొగ్గు: అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా విద్యార్థులు వివిధ కోర్సుల పట్ల ఆసక్తి కనబరిచారు. పాల్గొన్న వారిలో అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకోగా, మరికొంతమంది ఆయుర్వేదం, ఎంబీఏ (MBA) వంటి కోర్సుల వైపు మొగ్గు చూపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డీన్లు, ప్రొఫెసర్లు స్వయంగా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. విలువల కూడిన విద్యే లక్ష్యం: ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యను కేవలం వ్యాపారంగా చూడకుండా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మాలను ఆచరిస్తూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే తమ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే మెరిట్, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులకు శ్రీకాళహస్తి బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు సింగరాజు ప్రకాశం అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.