Monday, 27 July 2026
  • Home  
  • విద్యార్థి యువతి ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్

విద్యార్థి యువతి ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో .. వైసిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త *బూదూరు గురవయ్య* గారు, *విద్యార్థి యువజన విభాగం నాయకులతో కలిసి.. యువజన, విద్యార్థి ర్యాలీకి సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.* • మెగా డీఎస్సీ పేరుతో.. కూటమి ప్రభుత్వం డీఎస్సీని అక్రమాల మయంగా మార్చిందని జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు అన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎగొట్టి.. ఈరోజు విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం నడిరోడ్డులోకి నెట్టిందన్నారు. యువత విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈనెల 28వ తేదీ వి ఆర్ సి సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో.. దాడులు, దౌర్జన్యాలు అక్రమాలు పెచ్చు మిరిపోయాయని అన్నారు.మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందన్నారు. డిఎస్సీ పరీక్ష పేపర్ ను లీక్ చేసి ..కూటమి ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల పట్ల.. CBI విచారణ జరిపించాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం వెనకడుగు వేస్తుందన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరగకపోతే కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు.నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విధంగానే రాష్ట్రంలో డీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో.. మంత్రి నారా లోకేష్ కూడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు..మాయ మాటలు చెప్పి విద్యార్థులు యువతను మోసం చేశారని అన్నారు.నిరుద్యోగ భృతి.. ఈరోజు యువతకు అందని ద్రాక్షలా మారిందన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ.. విద్యార్థి యువత సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు.. ఈనెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు.

నెల్లూరు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో .. వైసిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త *బూదూరు గురవయ్య* గారు, *విద్యార్థి యువజన విభాగం నాయకులతో కలిసి.. యువజన, విద్యార్థి ర్యాలీకి సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.*

• మెగా డీఎస్సీ పేరుతో.. కూటమి ప్రభుత్వం డీఎస్సీని అక్రమాల మయంగా మార్చిందని జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు అన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎగొట్టి.. ఈరోజు విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం నడిరోడ్డులోకి నెట్టిందన్నారు. యువత విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈనెల 28వ తేదీ వి ఆర్ సి సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు.

*పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో.. దాడులు, దౌర్జన్యాలు అక్రమాలు పెచ్చు మిరిపోయాయని అన్నారు.మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందన్నారు. డిఎస్సీ పరీక్ష పేపర్ ను లీక్ చేసి ..కూటమి ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల పట్ల.. CBI విచారణ జరిపించాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం వెనకడుగు వేస్తుందన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరగకపోతే కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు.నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విధంగానే రాష్ట్రంలో డీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో.. మంత్రి నారా లోకేష్ కూడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు..మాయ మాటలు చెప్పి విద్యార్థులు యువతను మోసం చేశారని అన్నారు.నిరుద్యోగ భృతి.. ఈరోజు యువతకు అందని ద్రాక్షలా మారిందన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ.. విద్యార్థి యువత సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు.. ఈనెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.