Wednesday, 30 September 2026
  • Home  
  • వరద ప్రవాహంతో నిండుతున్న సోమశిల.. నెల్లూరు జిల్లాకు ఊరట!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరద ప్రవాహంతో నిండుతున్న సోమశిల.. నెల్లూరు జిల్లాకు ఊరట!

నెల్లూరు జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న నీటి కొరతకు ఉపశమనం లభిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటగా, సోమశిల జలాశయంలోనూ నీటిమట్టం క్రమంగా పడిపోయింది. దీంతో సాగు, తాగునీటి అవసరాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో ఈ నెల 19 నుంచి సోమశిలకు వరద ప్రవాహం ప్రారంభమైంది. గతంలో 15.287 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరువైంది. సోమవారం ఉదయం జలాశయానికి 3,684 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వ పెరుగుతుండటంతో జిల్లా ప్రజలకు కొంత ఊరట లభించింది. సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీటి నిల్వలు భరోసా కల్పిస్తాయని అధికారులు భావిస్తున్నారు. Uploaded Video:

నెల్లూరు జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న నీటి కొరతకు ఉపశమనం లభిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటగా, సోమశిల జలాశయంలోనూ నీటిమట్టం క్రమంగా పడిపోయింది. దీంతో సాగు, తాగునీటి అవసరాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో ఈ నెల 19 నుంచి సోమశిలకు వరద ప్రవాహం ప్రారంభమైంది. గతంలో 15.287 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరువైంది. సోమవారం ఉదయం జలాశయానికి 3,684 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వ పెరుగుతుండటంతో జిల్లా ప్రజలకు కొంత ఊరట లభించింది. సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీటి నిల్వలు భరోసా కల్పిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.