ఉదయగిరి మండల కేంద్రంలోని స్టేట్ పేటలో గల బర్డిట్ మెమోరియల్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో లక్కినేని వినయ్ కుమార్ కుమార్తె శ్రేయ పరిశుద్ధ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన దంపతులపై అక్షింతలు వేసి, వారి వైవాహిక జీవితం ప్రేమ, అనురాగం, ఆనందాలతో నిండిపోవాలని, పరస్పర అవగాహనతో కలకాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, ఈ నూతన దాంపత్య బంధం ఇరు కుటుంబాలకు ఆనందాన్ని, శుభసంపదలను తీసుకురావాలని కోరుకున్నారు.



