Sunday, 27 September 2026
  • Home  
  • రైల్వే క్రూ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు 6.79 కోట్లతో టెండర్ లకు ఆహ్వానం
- అన్నమయ్య

రైల్వే క్రూ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు 6.79 కోట్లతో టెండర్ లకు ఆహ్వానం

రైల్వే క్రూ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు 6.79 కోట్లతో టెండర్ లకు ఆహ్వానం నందలూరు వాసుల్లో ఆనందం ఫలించిన కష్టం.. నేతలు హర్షం నందలూరు వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని కోల్పోయి రైల్వే మరుగున పడుతున్న తరుణంలో రైల్వే ఉన్నతాధికారులు కాస్త కరుణించారు. చాలాకాలంగా అనేకమంది నేతలు పడ్డ కష్టాలు తీరాయి అన్న విధంగా ఎట్టకేలకు నందలూరులో రైల్వే క్రూ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 6.79 కోట్లతో టెండర్లకు రైల్వే శాఖ ఆహ్వానం పలికింది. దీంతో నందలూరు వాసుల్లో ఆనందం కనబడుతుంది. అనేక సంవత్సరాలుగా నేతలు పడ్డ కష్టాలు తీరను న్నాయని చెప్పవచ్చు. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోని నందలూరు రైల్వే కేంద్రం బ్రిటిష్ పరిపాలన నుండి ఒక వెలుగు వెలిగింది. ఎక్కడా లేనివిధంగా నందలూరులో రైలింజన్ లోకో షెడ్ ల్యాబి. క్రూ కేంద్రం సిటీ ఎక్స్ ఆర్ . ఐ ఓ డబ్లు. టి డబ్ల్యూ ఐ. విద్యుత్ శాఖ. హెల్త్ డిపార్ట్మెంట్. సిఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్ విభాగాలతో పాటు అనేక రైల్వే శాఖలు ఇక్కడ నెలకొల్పి వేలాదిమంది గతంలో విధులు నిర్వహించారు. కాలక్రమేన మారుతున్న కాలానికి అనుగుణంగా లోకో షెడ్ లు మూతపడి డీజిల్ ఇంజన్ లు అందుబాటులోకి రావడంతో రైలు ఇంజన్ ల లోకో షెడ్ మూతపడింది. అప్పటినుండి ఒక్కొక్క విభాగాన్ని ఇతర ప్రాంతాలకు రైల్వే అధికారులు తరలించారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా నందలూరు రైల్వే నిర్మానుష్యదశకు చేరుకునే తరుణంలో కొందరు ప్రజలు ఏకమై ఆందోళనకు సిద్ధమయ్యారు. రైల్వే డివిజన్ స్థాయి అధికారులతో పాటు రైల్వే జనరల్ మేనేజర్ రైల్వే మంత్రులకు వినతి పత్రాలు అందజేసి తమ గోడును విన్నవించుకున్నారు. నందలూరుతోపాటు రేణిగుంట గుంతకల్ సికింద్రాబాద్ ప్రాంతాలలో ఉన్న అధికారులకు నందలూరు కు పూర్వ వైభవం తీసుకురావాలని విన్నవించుకున్నారు. బ్రిటిష్ పాలకు లే నందలూరు లో స్వచ్ఛమైన పుష్కలమైన త్రాగునీటి వసతితోపాటు కావలసిన మౌలిక సదుపాయాలు స్థలాలు వందల ఎకరాలు ఉన్నాయని గుర్తించి అప్పట్లోనే గుంటకల్ రేణిగుంట మర్గమధ్యంలోని నందలూరు రైల్వే కేంద్రంలో అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే కొందరు రైల్వే ఉన్నతాధికారుల అలసత్వం మూలంగా కుంటి సాకులు చూపుతూ నందలూరు రైల్వే కేంద్రంలోని అనేక విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం నందలూరులో లాబీ కొనసాగుతుంది. గతంలో దాదాపు 600 మందికి పైగా లోకో పైలట్లు అసిస్టెంట్లు గార్డులు విధులు నిర్వహించేవారు. రైల్వేలో నూతన వరవడి ప్రారంభమై విద్యుత్ రైళ్ళు రావడంతో వేగం పెరిగి నందలూరు లో ఉన్న క్రూ కేంద్రాన్ని మైలేజీ పేరుతో ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే అక్కడ కావలసిన త్రాగునీరు మౌలిక వసతులతో పాటు వాతావరణ పరిస్థితులు బాగా లేవని అధికంగా కాలుష్యం ఉందని కార్మికులు అధికారులకు మొరాయించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటిని ప్రతిరోజు కొనుగోలు చేస్తూ రైల్వే శాఖ లక్షలాది రూపాయల ధనాన్ని వృధా చేస్తుంది. ఇలాంటి తరుణంలో నందలూరులో ఉన్న అనేక రకాల వసతులతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు ఉండడంతో ఈ ప్రాంతంలో నూతనంగా క్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం శుభసూచకమని చెప్పవచ్చు. చాలా సంవత్సరాల కాలం క్రితం కొందరు ఉద్యమాలు చేసిన పెద్దగా ఫలితం కనిపించలేదు. ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రులను కలిసినప్పుడు ఆశలు రేపారు . కొద్ది రోజులకే నందలూరు రైల్వే సమస్యలకు శుభం కార్డు వేశారు. గడచిన మూడు సంవత్సరాల్లో ఉన్నతాధి అధికారులకు ఈ ప్రాంతానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నందలూరు కు న్యాయం చేయాలని వినతి పత్రాలు అందజేశారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ నందలూరు లో ఉన్న అన్ని రకాల వసతుల గురించి వివరంగా తెలియజేస్తూ కొందరి సహకారంతో రైల్వే జనరల్ మేనేజర్ కు పది పేజీల పూర్తిస్థాయి వివరాలతో వినతి పత్రాలు అందజేశారు. ఎలాగోలా రైల్వే శాఖ అధికారులు స్పందించారనే చెప్పవచ్చు. చాలాకాలం తర్వాత నందలూరులో క్రూ కేంద్రం ఏర్పాటుకు టెండర్లకు ఆహ్వానం పలకడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో మోడల్ రన్నింగ్ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసి భూమి పూజ కూడా పూర్తి చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ నందలూ రులో రన్నింగ్ రూమ్ (క్రూ)ఏర్పాటుకు టెండర్లకు ఆహ్వానం పలకడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని అన్ని రకాల వనరులను రైల్వే శాఖ వినియోగించుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

రైల్వే క్రూ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు
6.79 కోట్లతో టెండర్ లకు ఆహ్వానం
నందలూరు వాసుల్లో ఆనందం ఫలించిన కష్టం.. నేతలు హర్షం
నందలూరు వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని కోల్పోయి రైల్వే మరుగున పడుతున్న తరుణంలో రైల్వే ఉన్నతాధికారులు కాస్త కరుణించారు. చాలాకాలంగా అనేకమంది నేతలు పడ్డ కష్టాలు తీరాయి అన్న విధంగా ఎట్టకేలకు నందలూరులో రైల్వే క్రూ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 6.79 కోట్లతో టెండర్లకు రైల్వే శాఖ ఆహ్వానం పలికింది. దీంతో నందలూరు వాసుల్లో ఆనందం కనబడుతుంది. అనేక సంవత్సరాలుగా నేతలు పడ్డ కష్టాలు తీరను న్నాయని చెప్పవచ్చు. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోని నందలూరు రైల్వే కేంద్రం బ్రిటిష్ పరిపాలన నుండి ఒక వెలుగు వెలిగింది. ఎక్కడా లేనివిధంగా నందలూరులో రైలింజన్ లోకో షెడ్ ల్యాబి. క్రూ కేంద్రం సిటీ ఎక్స్ ఆర్ . ఐ ఓ డబ్లు. టి డబ్ల్యూ ఐ. విద్యుత్ శాఖ. హెల్త్ డిపార్ట్మెంట్. సిఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్ విభాగాలతో పాటు అనేక రైల్వే శాఖలు ఇక్కడ నెలకొల్పి వేలాదిమంది గతంలో విధులు నిర్వహించారు. కాలక్రమేన మారుతున్న కాలానికి అనుగుణంగా లోకో షెడ్ లు మూతపడి డీజిల్ ఇంజన్ లు అందుబాటులోకి రావడంతో రైలు ఇంజన్ ల లోకో షెడ్ మూతపడింది. అప్పటినుండి ఒక్కొక్క విభాగాన్ని ఇతర ప్రాంతాలకు రైల్వే అధికారులు తరలించారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా నందలూరు రైల్వే నిర్మానుష్యదశకు చేరుకునే తరుణంలో కొందరు ప్రజలు ఏకమై ఆందోళనకు సిద్ధమయ్యారు. రైల్వే డివిజన్ స్థాయి అధికారులతో పాటు రైల్వే జనరల్ మేనేజర్ రైల్వే మంత్రులకు వినతి పత్రాలు అందజేసి తమ గోడును విన్నవించుకున్నారు. నందలూరుతోపాటు రేణిగుంట గుంతకల్ సికింద్రాబాద్ ప్రాంతాలలో ఉన్న అధికారులకు నందలూరు కు పూర్వ వైభవం తీసుకురావాలని విన్నవించుకున్నారు. బ్రిటిష్ పాలకు లే నందలూరు లో స్వచ్ఛమైన పుష్కలమైన త్రాగునీటి వసతితోపాటు కావలసిన మౌలిక సదుపాయాలు స్థలాలు వందల ఎకరాలు ఉన్నాయని గుర్తించి అప్పట్లోనే గుంటకల్ రేణిగుంట మర్గమధ్యంలోని నందలూరు రైల్వే కేంద్రంలో అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగించారు. అయితే కొందరు రైల్వే ఉన్నతాధికారుల అలసత్వం మూలంగా కుంటి సాకులు చూపుతూ నందలూరు రైల్వే కేంద్రంలోని అనేక విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం నందలూరులో లాబీ కొనసాగుతుంది. గతంలో దాదాపు 600 మందికి పైగా లోకో పైలట్లు అసిస్టెంట్లు గార్డులు విధులు నిర్వహించేవారు. రైల్వేలో నూతన వరవడి ప్రారంభమై విద్యుత్ రైళ్ళు రావడంతో వేగం పెరిగి నందలూరు లో ఉన్న క్రూ కేంద్రాన్ని మైలేజీ పేరుతో ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే అక్కడ కావలసిన త్రాగునీరు మౌలిక వసతులతో పాటు వాతావరణ పరిస్థితులు బాగా లేవని అధికంగా కాలుష్యం ఉందని కార్మికులు అధికారులకు మొరాయించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటిని ప్రతిరోజు కొనుగోలు చేస్తూ రైల్వే శాఖ లక్షలాది రూపాయల ధనాన్ని వృధా చేస్తుంది. ఇలాంటి తరుణంలో నందలూరులో ఉన్న అనేక రకాల వసతులతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు ఉండడంతో ఈ ప్రాంతంలో నూతనంగా క్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం శుభసూచకమని చెప్పవచ్చు. చాలా సంవత్సరాల కాలం క్రితం కొందరు ఉద్యమాలు చేసిన పెద్దగా ఫలితం కనిపించలేదు. ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రులను కలిసినప్పుడు ఆశలు రేపారు . కొద్ది రోజులకే నందలూరు రైల్వే సమస్యలకు శుభం కార్డు వేశారు. గడచిన మూడు సంవత్సరాల్లో ఉన్నతాధి అధికారులకు ఈ ప్రాంతానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నందలూరు కు న్యాయం చేయాలని వినతి పత్రాలు అందజేశారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ నందలూరు లో ఉన్న అన్ని రకాల వసతుల గురించి వివరంగా తెలియజేస్తూ కొందరి సహకారంతో రైల్వే జనరల్ మేనేజర్ కు పది పేజీల పూర్తిస్థాయి వివరాలతో వినతి పత్రాలు అందజేశారు. ఎలాగోలా రైల్వే శాఖ అధికారులు స్పందించారనే చెప్పవచ్చు. చాలాకాలం తర్వాత నందలూరులో క్రూ కేంద్రం ఏర్పాటుకు టెండర్లకు ఆహ్వానం పలకడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో మోడల్ రన్నింగ్ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసి భూమి పూజ కూడా పూర్తి చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ నందలూ రులో రన్నింగ్ రూమ్ (క్రూ)ఏర్పాటుకు టెండర్లకు ఆహ్వానం పలకడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని అన్ని రకాల వనరులను రైల్వే శాఖ వినియోగించుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.