రైతుల ప్రయోజనాలను కాపాడాలి: అమరావతి రైల్వే లైన్ రైతూ బాధితుల విజ్ఞప్తి.
అమరావతి నూతన రైల్వే లైన్ నిర్మాణం కారణంగా తమ జీవనాధారమైన భూములను కోల్పోతున్న రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్.
ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్,26, భారత్ న్యూస్..
ఇబ్రహీంపట్నం మండలం పరిటాల, కోత్త పేట, చిలుకూరు, దాములూరు గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.
దేశ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు తాము వ్యతిరేకం కాదని, అయితేమా భూములు కోల్పోతున్న రైతుల పట్ల ప్రభుత్వం పారదర్శకత, శాస్త్రీయ ప్రణాళిక మరియు మానవత్వంతో వ్యవహరించాలని వారు కోరుతున్నారు.
ఈ విషయమై ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ ఆర్డీఓ, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నందిగామ, మైలవరం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ), కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు తాము విజ్ఞాపన పత్రాలను సమర్పించామని రైతులు తెలిపారు.
ఇప్పటివరకురైతులప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే:
సంయుక్త సమీక్ష: రైల్వే మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రైతుల సమస్యలపై తక్షణమే సమీక్ష జరపాలి.
అభ్యంతరాల పరిశీలన: ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) లో రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, వాటికి లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలి.
శాస్త్రీయ అధ్యయనాలు: ప్రాజెక్టు నిర్మాణానికి ముందే హైడ్రోలాజికల్ (జలవనరుల), వరద ముంపు ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థలపై పూర్తి స్థాయి అధ్యయనాలు చేసి ఆ నివేదికలను బహిర్గతం చేయాలి.
ప్రత్యామ్నాయాల పరిశీలన: ప్రతిపాదిత రైల్వే అలైన్‌మెంట్‌పై స్వతంత్ర సాంకేతిక సమీక్ష జరిపి, సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి.
న్యాయమైన పరిహారం: చట్టప్రకారం రైతులకు సరైన నష్టపరిహారం మరియు పునరావాస ప్యాకేజీని పారదర్శకంగా అమలు చేయాలి. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ముందు బాధిత రైతులతో అర్థవంతమైన సంప్రదింపులు జరపాలి.
తమ జీవనోపాధిని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, న్యాయం మరియు సుపరిపాలన ప్రాతిపదికన ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోత్త పేట, చిలుకూరు, దాములూరు గ్రామాలకు చెందిన రైతులు ప్రత్తిపాటి కృష్ణా రావు, ప్రత్తిపాటి పూర్ణ చంద్ర రావు, కాటేపల్లి సుబ్బారావు (తెలుగు దేశం గ్రామ పార్టీ అధ్యక్షులు), ప్రత్తిపాటి వంశీ కృష్ణా, ఎర్రగుంట్ల నరేష్, బత్తుల సుజాత, నల్లూరి పెద్ద అప్పారావు, ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు, పాటిబండ్ల నరసింహ రావు, ఎర్రగుంట్ల నరసమ్మ, ఎర్రగుంట్ల సుబ్బారావు, అబ్బూరి శ్రీనివాసరరావు, సుంకర భాస్కరరావు, గద్దె రవి, కొనకంచి నరసింహారావు, గోంది సురేష్ బాబు (మాజీ సర్పంచ్), ఎర్రగుంట్ల కోటయ్య, పెనుగొండ అశోక్ తదితర భూమి కోల్పోతున్న రైతులు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.




