అనకాపల్లి జిల్లా, జూలై 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వం నిర్ణయించిన తేదీ కంటే రెండు రోజులు ముందుగానే లబ్ధిదారులకు అందజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటూ, పెన్షన్దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. కార్యక్రమంలో వీఆర్వో జిలాని, సచివాలయ సిబ్బంది పాల్గొని పెన్షన్ల పంపిణీని సజావుగా నిర్వహించారు.

రెండు రోజులు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వ చేయూత
అనకాపల్లి జిల్లా, జూలై 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వం నిర్ణయించిన తేదీ కంటే రెండు రోజులు ముందుగానే లబ్ధిదారులకు అందజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటూ, పెన్షన్దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. కార్యక్రమంలో వీఆర్వో జిలాని, సచివాలయ సిబ్బంది పాల్గొని పెన్షన్ల పంపిణీని సజావుగా నిర్వహించారు.

