శ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి, జూన్ 19: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేస్తూ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. దేశ సేవకు అంకితమైన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఆయన దేశానికి మరింత సేవ చేసే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు