Sunday, 7 June 2026
  • Home  
  • కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- ఆదిలాబాదు

కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు అనసూయ, కార్యదర్శి ఉమా డిమాండ్ చేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్ లో ఉన్న అధికారులు సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. గత 12 నెలల నుండి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించినప్పటికీ రిమ్స్ అధికార యంత్రాంగం చీమకుట్టినట్లుగా కూడా వ్యవ వివరించడం సరికాదన్నారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు వెంటనే ఖాతాలో జమ చేయాలని అన్నారు. కొంతమంది నాయకులు అధికారులకు మభ్యపెడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని, కార్మికులు అడుగుతే మాయ మాటలు చెప్పి మాట దాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రిమ్స్ అధికారులు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్, ప్రమోద్, వంశీ, కుంటాల లక్ష్మి, సారిక, అనిత, రాధ, సుగుణ, గంగు, శారద, జై శీల తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.