ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం శాంతబాయి అధ్యక్షతన నిర్వహించగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, జిల్లా డిప్యుటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగయ్య, కీర్తి రమణ, ఉస్మాన్ లు హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ ఎండిఎం కార్మికులు దాదాపుగా 25 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకు మధ్యాహ్నం వంట చేసి పెడుతున్నారన్నారు కానీ నేటికీ ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి రాగానే కార్మికులకు రూ.10 వేలు వేతనాలు ఇస్తామని చేప్పి నేటికీ రెండున్నర సంవత్సరాలు అవుతున్న కార్మికులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు కనీసం వేతనం 26 వేలు చెల్లించాలన్నారు. లేని పక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సంఘం జిల్లా మహాసభలు ఈ నెల 14 వ తేదీన జిల్లా కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని హాజరవుతారని, కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్, ఇచ్చోడ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, సిరికొండ మండలాల కార్మికులు పాల్గొన్నారు.

ఎండిఎం సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం